కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యంశాలు

union budget 2020

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఉపాధి దొరుకుతుందని, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, మైనార్టీలకు, మహిళలకు, ఎస్సీఎస్టీల ఆశలను నెరవేర్చే విధంగా 2020 బడ్జెట్ ఉండబోతోందని నిర్మల చెప్పారు. ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని.. సంపదను సృష్టించడమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యంశాలు:

  • గత ఎన్నికల్లో ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో అధికారం అప్పగించారు. 

  • జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి.

  • జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు

  • 26 లక్షల మంది రైతులకు సోలార్ పంప్ సెట్లు 

  • కరువు జిల్లాలకు త్రాగునీరు అందించే పధకాలు 

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యం 

  • బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం

  • రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి

  • భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు రైతులకు సహాయం