లాక్‌డౌన్ ఉల్లంఘ‌న : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు 

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగరంలో వెలుగుచూసింది. ఎమ్మెల్యే తన నివాసంలో పేదలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దాదాపు వెయ్యిమందికిపైగా ఆయన ఇంటి వద్దకు చేరారు.
        సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీన్నిఉల్లంఘించి సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై సెక్షన్ 188, 144, 279ల కింద కేసు నమోదు చేసినట్టు అడిషనల్ ఎస్పీ ఓపీ శర్మ తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎమ్మెల్యే వాదన మరోలా ఉంది. తన ఇంటి వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడడంతో తానే స్వయంగా ఎస్పీకి సమాచారం అందించానని శైలేష్ పాండే తెలిపారు. ప్రజలు తిండిలేక కష్టాలు ఎదుర్కొంటుండడంతోనే తాను రేషన్ సరఫరా చేశానని, అది తప్పెలా అవుతుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.