కరోనా పై కామెడీ చేస్తే కటకటాలే

DO PRANKS ON CORONA, IS A CRIME

ప్రస్తుత సమాజంలో, క్రియేటివిటీ పేరుతో సొంత పైత్యం పిచ్చి కుక్కలా స్వైర విహారం చేస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా భారతదేశంకి వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తుంటే, కరోనా మీద జోకులు, కామెడీ వీడియోలు చేస్తున్నారు కొందరు. మనతో పోల్చుకుంటే నార్త్ లో ఈ తంతు నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. కరోనా ప్రాంక్స్ చేసే స్థాయికి వారి పిచ్చి పరిమళించింది. ముంబైలో ఉన్న ఒక అపార్ట్మెంట్ ముందు  కూర్చున్న వృద్ధుని వద్దకు, ఒక అమ్మాయి వచ్చి, తన చేతుల్తో ఆ వృద్ధుని ముఖాన్ని తాకడం, అతని మీద తుమ్మడం లాంటివి చేసింది. అంతేకాదు తనకి కరోనా ఉందని, అందుకే ఇలా చేశానని చెప్పడంతో ఆ వృద్ధుడు భయంతో ప్రాణాలు పోయేంత పని జరిగింది. తీవ్ర భయానికి లోనైనా అతను. ప్రాణ భయంతో కేకలు వేస్తుంటే, ఈ మహాతల్లి వాళ్లకి కావాల్సిన ఫుటేజ్ వచ్చిన తరవాత మెల్లగా ఇదంతా ప్రాంక్ అని చెప్పింది.
దాంతో ఆ ముసలాడి చిర్రెత్తి, అమ్మాయిని నోటికొచ్చినట్టు తిట్టాడు. అసలే లాక్ డౌన్ సమయం రోడ్ మీద ఎక్కడపడితే అక్కడ పోలీసులు ఉన్నారు. వెంటనే ఆ పెద్దాయన పోలీసుల దగ్గరకి ఆ అమ్మాయిని, కెమెరామెన్ ని తీసుకుపోయి కంపాయింట్ ఇచ్చాడు, పోలీసులు వారి వద్ద నుండి కెమెరాని స్వాధీనం చేసుకుని వారిద్దరిని స్టేషన్ కి తరలించారు. కరోనా బారిన పది చనిపోయిన వాళ్లలో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళున్నా ఇలాగే ప్రాంక్ చేస్తుందా అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. మనకి నష్టం కలగనంతవరకుM అది కష్టం కాదనుకునే వారికి ఇదో గుణపాఠమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.