కరోనా పై పోరాటానికి అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం

AKSHAY KUMAR ANNOUNCE 25 CRORES FUND FOR CORONA FIGHT

బాలీవుడ్ లో ఖాన్ ల హవా నడుస్తున్నా, కపూర్ ల హవా నడుస్తున్నా, మొదటి నుండి తన క్రేజ్ ని ఇమేజ్ ని అంచెలంచెలుగా పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. తనకంటూ బలమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సామాజిక కార్యక్రమంలోనైనా ముందుండే అక్షయ్, మరోసారి సమాజం పట్ల తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు. దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనాపై పోరాటానికి 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు.ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు ప్రకటించిన విరాళాల్లో ఇదే అత్యధికమని తెలుస్తోంది.  ఈ మొత్తంలో 5 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 20 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు  అక్షయ్ ప్రకటించాడు.