మోదీజీ తొంద‌ర‌పాటు.. ఆ నిర్ణ‌యం స‌రైన‌దేనా..? 

narendra modi's decision fair..?

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నాయి. రాబోయే ప్ర‌మాదాన్ని ముందుగానే అంచ‌నా వేయ‌డంలో విఫ‌ల‌మైన మోదీ స‌ర్కార్, ఆ త‌ర్వాత తీసుకున్న తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల నిరుపేదలు రోడ్డున ప‌డుతున్నారు. 

అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. గ‌త ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూకి పిలుపు నిచ్చిన న‌రేంద్ర మోదీ, ఆరోజు సాయంత్ర‌మే హ‌డావుడిగా మార్చి 31 వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత దాన్ని ఏప్రిల్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌క‌టించారు. మోదీ లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గానే ఎక్క‌డి వారు అక్క‌డే నిలిచిపోయారు. రైళ్ళు, బ‌స్సులు ఆగిపోయాయి.. వ్యక్తిగత వాహనాలు తీయడానికి జనం భయపడిపోయారు.

ఈ క్ర‌మంలో ఉపాధి కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ళిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పొట్ట కూటి కోసం ప‌క్క ఊర్ల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్ళిన వారు.. తిరిన త‌మ‌  సొంత ప్రాంతానికి వెళ్లడానికి రవాణా లేదు, పోనీ అక్క‌డే ఉండామ‌నుకుంటే వారికి కూడూ, నీడా లేదు. లాక్‌డౌన్ ప్ర‌క‌టించి వారం రోజులు గ‌డిచినా వారి గురించి ప‌ట్టించుకునేవారే లేరు. రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు వారికి ఎలాంటి ప‌రిష్కారం చూప‌క‌పోవ‌డం ప్ర‌భుత్వాల వైఫ‌ల్య‌మే అని కొంద‌రి వాద‌న‌.  

ఒక్క‌సారిగా ర‌వాణా వ్య‌వ‌స్థ మొత్తం బ్రేక్ ప‌డ‌డంత‌తో వారంతా ఓకేచోట గుమ‌కూడి స్వ‌స్థ‌లాల‌కు వెళ్ళ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలామంది పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తింటూనే ఉన్నారు. మ‌రోవైపు కొంత‌మంది పిల్లల్ని వెంట వేసుకుని కాలినడకన ప్రయాణం చేస్తున్న వారిని చూస్తుంటే గుండె త‌రుక్కుపోతుంది. అయితే వీరి కష్టాలకు కారణం ఎవ‌రు.. అస‌లు క‌రోనాకి వీరికీ సంబంధం ఏంటి.. అంటే ప్ర‌భుత్వం వ‌ద్ద ఎలాంటి స‌మాధానం లేదు.. మరోవైపు ఇలా ప్రయాణాల‌కు పూనుకున్న‌వారిలో, ప‌లువురు మ‌ధ్య‌లోనే దుర్మరణం పాలయ్యారు. 

దీంతో లాక్‌డౌన్ లేక‌పోయి ఉంటే వీరి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవా అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. అయితే  జ‌న‌తా క‌ర్ఫ్యూ త‌ర్వాత రెండు రోజులు పాటు బ‌స్సులు, రైళ్ళు, ఇత‌ర వాహ‌నాల్లో ఎవ‌రి స్వ‌స్థ‌లాల‌కు వారిని పంపిన త‌ర్వాత, లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తే బాగుండేద‌ని కొంద‌రు వాద‌న‌. అలా చేస్తే దేశంలో క‌రోనా వైర‌స్ మ‌రింత విజృంభించేద‌ని ఇంకొంద‌రి వాద‌న.ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. విదేశాల నుండి వ‌చ్చిన వారు ఇప్ప‌టికే చాలా మందికి ఈ రోగాన్ని అంటించేశారు. 

ముఖ్యంగా వారంతా ఉన్న‌త వ‌ర్గీయులు వావ‌డం గ‌మ‌నార్హం. హోమ్ క్వారంటైన్‌ని నిర్ల‌క్ష్యం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌తున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకే ఇత‌ర దేశాలతో పాటు ఇండియాలో కూడా క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుతూనే ఉన్నాయి త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఒక‌వైపు లాక్‌డౌన్ క‌ష్టాలు, మ‌రోవైపు కరోనా క‌ట్ట‌డి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారని ఓ వ‌ర్గం మండిప‌డుతోంది. దీంతో ప్ర‌ధాని మోదీజీ హాడావుడిగా తీసుకున్న‌ లాక్‌డౌన్ నిర్ణ‌యం.. తెలివైన ప‌నేనా, లేక త‌న తొంద‌ర‌పాటు నిర్ణ‌యంతో చాలామంది నిరుపేద‌ల్ని రోడ్డున ప‌డేశారా అనేది ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.