ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజ‌టివ్.. లేటెస్ట్ నెంబ‌ర్స్ ఇవే..!

corona virus positive cases list in andhrapradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల‌ యూకే నుంచి రాష్ట్రానికి వచ్చి కరోనా బారిన పడిన వ్య‌క్తిని ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ల‌వ‌గా, ఆ ఇద్ద‌రికి కూడా కరోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఏపీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విశాఖ‌లో ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు, కృష్ణాలో నాలుగు క‌రోనా కేస‌లుఉ, గుంటూరులో నాలుగు క‌రోనా కేసులు, ప్రకాశం జిల్లాలో ముడు క‌రోనా కేసులు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది.