వాళ్ళ కోసం.. జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ys jagan takes key decision

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ కోసం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదేశాల మేర‌కు మూడు వారాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌ధాని ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కి, లాక్‌డౌన్ ఆదేశాల‌ను ఉల్లంఘించి తెలంగాణ‌లోని హాస్ట‌ల్స్‌లో ఉంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన విద్యార్ధులు, ఉద్యోగులు స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరగా, ఏపీ స‌ర్కార్ అభ్యంత‌రం తెల్ప‌డంతో, రెండు రోజులు డ్రామాలు చేసి చివ‌రికి క్వార‌టైన్ సెంట‌ర్స్‌కి చేరుకున్నారు. 

అయితే వారంతా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇత‌ర రాష్ట్రాల నుండి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎవ‌రైనా 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడాల్సిందేనని జగన్ తెలిపారు. ఇక ఇందుకోసం సరిహద్దు ప్రాంతంలోని కల్యాణ మండపాలను, హోటళ్లను సిద్ధం చేసి, వాటిని క్వారంటైన్ సెంట‌ర్లుగా వినియోగించాల‌ని నిర్ణ‌యించిన జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. వారి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని, అలాగే  వలస కూలీల పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయిలో అధికారిని నియ‌మించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.