వదంతులు నమ్మొద్దు

don't believe rumors on corona

భయంలో ఉన్న మనిషినినమ్మించడం చాలా తేలికని అంటుంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వారు, వారి క్రియేటివిటీకి పైత్యాన్ని జోడించి కరోనా మీద అసత్య ప్రచారాన్ని, వదంతుల్ని జనాల మీదకి వదులుతున్నారు. సోషల్ మీడియాలో కూడా కరోనా భయాన్ని పెంచుతూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిలో కొన్ని కరోనాని తేలికగా తీసుకునేటట్లు చేస్తే, మరికొన్ని కరోనా మీద భయాన్ని వందల రేట్లు పెంచేలా ఉన్నాయి.
అయితే ఇందులో ముఖ్యంగా ఇటలీలో పరిస్థితుల మీద వస్తున్న వదంతులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రకటనలను తప్ప మరేవి నమ్మొద్దు, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ప్రభుత్వం స్పందిస్తుంది.