క‌రోనాతో ఫిక‌ర్ : తెలంగాణ‌ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Telangana government takes sensational desicion

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది. ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కరోనా వైర‌స్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌క‌పోతుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మారుస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ క్ర‌మంలో ఇకముందు గాంధీ ఆసుపత్రిలో కేవ‌లం కరోనాకు మాత్రమే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. క‌రోనా మూడో దశకు చేరకుండా ఉండేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈటల రాజేందర్ స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.