క‌రోనా పై యుధ్ధం .. మహేష్ బాబు భారీ విరాళం..!

mahesh babu dontes one crore for coronavirus outbreak

కరోనా వైరస్ కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం ఫిక‌ర్ అవుతోంది. ఇక మ‌న‌దేశంలో కూడా క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ వ్యాప్తి చెందుతూనే ఉంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ఈ వైర‌స్ బారిన ప‌డిన‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. దీంతో రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు ముందుగానే అల‌ర్ట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతోంది.

ఇక దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగిస్తూ.. క‌రోనా వైర‌స్‌ను నివారించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు భారీగా విరాళాల ప్ర‌క‌టిస్తూ సామిజిక బాధ్య‌త‌ను చాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు, క‌రోనా బాదిత‌లు స‌హాయం కొర‌కు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఒక్క‌రు ప్రభుత్వ ఆదేశాల‌ను పాటించాల‌ని, లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేయొద్ద‌ని మ‌హేష్ బాబు విజ్ఞ‌ప్తి చేశారు.