నువ్వు నిజంగానే.. సూప‌ర్ డార్లింగ్..! 

prabhas dontes one crore for coronavirus outbreak

కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశమంతా ఒక్క‌టై పోరాటం సాగిస్తున్నారు. ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం, మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వ్వ‌వ‌స్థ‌ల‌న్నీ స్థంభించిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల‌ను కూడా క‌రోనా ట‌చ్ చేయ‌డంతో మ‌న ప్ర‌భుత్వాలు నిర్విరామంగా పోరాటం చేస్తూ కీల‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

ఈ నేప‌ధ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్ర‌ముఖులు మేమ సైతం అంటూ విరాళాలు ప్ర‌క‌టిస్తూ క‌రోనా పై పోరాటంలో భాగ‌మ‌వుతున్నారు. తాజాగా టాలీవుడ్ డార్లింగ్ ప్ర‌భాస్ రెండు తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఏపీ సీయం రిలీఫ్ ఫండ్‌కు 50 ల‌క్ష‌లు, తెలంగాణ సీయం రిలీఫ్ ఫండ్‌కు 50 ల‌క్ష‌లు విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌జ‌లంతా ఇళ్ళల్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించాల‌ని కోరారు.