సినిమా జీవుల‌ కోసం.. చిరంజీవి మెగా విరాళం..!

Chiranjeevi donation for film workers

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ ప్ర‌భావం పలు రంగాల పై ప‌డుతోంది. ఈ క్ర‌మంలో సినీ రంగం పై కూడా ఈ ప్ర‌భావం ప‌డింది. సినీ పరిశ్ర‌మ‌లో 24 విభాల‌కు చెందిన  కార్మికుల పైన, అలాగే ప‌లువురు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాది ప‌నులు, వ్యాపారం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ప్ర‌భావం వీరి పై ప‌డింది. దీంతో సినీ కార్మికుల సంక్షేమానికి మెగాస్టార్ చిరంజీవి తాజాగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. దీంతో ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చిరంజీవి పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.