అమీర్‌పేట‌లో ఉచిత భోజ‌నం ప్రారంభించిన.. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్..!

Talasani Srinivas launches free meals point at Ameerpet

అమీర్ పేట, మ‌నం న్యూస్ : కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం తెలంగాణ పై కూడా ప‌డింది. దీంతో ఇప్ప‌టికే 21 రోజులు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో,  ప‌లువురు ఆక‌లి బాధ‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో హైద‌రాబాద్‌లో పలు చోట్ల ఉచిత భోజ‌న కేంద్రాల్ని ప్రారంభిస్తున్నారు. ఈక్ర‌మంలో తాజాగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్.. అమీర్‌పేట లోని స‌త్యం థియేట‌ర్ వ‌ద్ద 5 రూపాయిల ఉచిత భోజ‌న కేంద్రాన్నిప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, మాగంటి గోపినాథ్, అమీర్‌పేట్ కార్పోరేట‌ర్ నామ‌న శేషుకుమారి త‌దితరులు పాల్గొన్నారు.