గరీబ్ కళ్యాణ్ యోజ‌న : ఇంత‌కీ ఎవ‌రికి లాభ‌మంటే..?

gareeb kalyan yojana scheme beneficiaries

కరోనా వైరస్ ప్రభావం మ‌న‌దేశంలో ఉండ‌డంతో, కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా మూడు వారాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొంత‌మంది ఉపాది కోల్పోతుండ‌గా, మ‌రికొంత‌మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పేద‌ల‌ను ఆదుకోవ‌డానికి కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లక్షా డెబ్బై వేల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

## గరీబ్ కళ్యాణ్ యోజ‌న ప‌థ‌కంలో లబ్ధిదారులు ఎవరో మీరూ తెలుసుకోండి.

* ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్‌ యోజన్‌ ద్వారా 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌. ప్రస్తుతం 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలు ఉచితంగా వస్తున్నాయి. వాటితో పాటు ఒక్కొకరికి మరో 5 కేజీలు బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పు ఉచితంగా ఇస్తారు.

* ఇక పలు వర్గాలకు నగదు బదిలీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు కిసాన్ కింది ఇప్ప‌టికే రైతుల‌కు 6 వేలు ఇస్తున్నారు. మొదటి విడతగా 2 వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయ‌నున్నారు.   

* ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని 182 నుంచి  202 చేసింది కేంద్రం. దీంతో ఒక్కొక్క‌రికి ఒకరికి  2,000 వరకు లాభం ఉంటుంది. ఈ నిర్ణయం కార‌ణంగా 5 కోట్ల కుటుంబాలకు మేలు జ‌రుగ‌నుంది.

* ఇక వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ కన్నా అదనంగా మ‌రో 1,000 రెండు విడ‌త‌లుగా ఇవ్వ‌నున్నారు. దీంతో మూడు కోట్ల మందికి ల‌బ్ధి చేకూరుతుంది. 

* జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు 500 చొప్పున మూడు నెలల వరకు ఇస్తామన్నారు.  ఉజ్వల స్కీమ్‌లో ఉన్నవారికి మూడు నెలల పాటు ఉచితంగా సిలిండర్లు. దీంతో 8 కోట్ల కుటుంబాల‌కు ల‌బ్ధి.  

* డ్వాక్రా గ్రూపులకు దీన్ ద‌యాల్ యోజ‌న ప‌థ‌కం ద్వారా ఎలాంటి ష్యూరిటీలు లేకుండా రుణాలు. అలాగే డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు 10 లక్షల నుంచి  20 లక్షలకు పెంపు. దీంతో 7 కోట్ల కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూరుతుంది. 

* ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది. 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థ‌ల‌కు అలాగే నెల‌కు 15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. అలాగే తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75 శాతం వ‌ర‌కు లేదా మూడు నెల‌ల వేతనం విత్‌డ్రా చేసుకునే అవకాశం క‌ల్పిసుంది. దీంతో 4 కోట్ల‌కు పైగా ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంది. 

* ఇక భవన నిర్మాణ కార్మికుల కోసం 31వేల కోట్లు కేటాయింపు. ఈ నిధుల‌తో దాదాపు 3.5 కోట్ల మంది రిజిస్ట‌ర్డ్ భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను ఆదుకుంటారు. అలాగే రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు