తెలంగాణలో 41కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 41కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రోజురోజుకు పెరుగుతున్న‌ క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు  తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరింది. బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పాజిటివ్ కేసు లేదని ప్రత్యేకంగా ఒక బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. కొద్ది సేపటికే మరో బులిటెన్ విడుదల చేసింది. మరో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. అందులో ఒకటి ప్రైమరీ కాంటాక్టుగా ఒక మహిళ, మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన 41 కేసుల్లో 3 సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం మొట్టమొదటిదిగా చెప్పవచ్చు. ఈ చిన్నారి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.