KTR సమీక్ష, సహకారం

KTR SURVEY ON HOSTLERS

హైదరాబాద్ లో హాస్టళ్లన్నీ, మూసివేసిన సందర్భంలో ఉద్యోగులు, విద్యార్థులు వారి ఊళ్ళకి వెళ్లాలనే ఉదేశ్యంతో, ఆంధ్ర బోర్డర్లో అనుమతి కోసం వేచి ఉండిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్రపెదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళని ఏపీ లోకి అనుమతించలేని పరిస్థితి నెలకొంది, కొన్ని వందల మందిని ఒకేసారి రాష్ట్రంలోకి బదిలీతే ఇంత వరకు పడిన జాగ్రత్త బూడిదపాలయ్యే ప్రమాదముందనేది వారి వాదన. అందులోనూ నిజం లేకపోలేదు. అందుకనే ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని విజ్ఞప్తి మేరకు, స్వయంగా తెలంగాణా మంత్రి KTR ఈ పరిస్థిని సమీక్షిస్తున్నారు, బాధితులకు ఉపశమన కలిగించే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో హాస్టళ్ల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. నైట్ షెల్టర్లలో ఉన్న వారికి తగిన సదుపాయాలను సమకూర్చి, ఐదు రూపాయలకే బహుజన సదుపాయాన్ని కలిగిస్తామని చెప్పారు. KTR నిర్ణయంపై సర్వత్రా హర్షం వెలువడుతుంది.