ఎరక్కపోయి వచ్చారు, ఇరుక్కుపోయారు.

NO ENTRY IN AP BORDER

చాలా మంది జనంతో నేషనల్ హైవే ఉద్రిక్తంగా మారింది. వాళ్లంతా ఏపీ లోకి వెళ్తామంటూ గొడవ చేస్తున్నారు. మమ్మల్ని మా ఇంటికి ఎందుకు పంపించరూ అంటూ పోలీసుల్ని నిలదీస్తున్నారు. అసలు మీరెందుకు ఇప్పుడు ఆంధ్ర లోకి వెళ్ళాలి అంటే సెలవులు ఇచ్చారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో డాక్టర్లున్నారు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు. కానీ అక్కడి వారి వాదన వింటుంటే, అసలు వీళ్ళకి కనీస జ్ఞానం ఉందా అనిపించక మానదు. ప్రభుత్వం మొత్తం ప్రజానీకాన్ని ఇంటికే పరిమితం చేసింది, ఊళ్ళకెళ్ళి ఊరేగమని కాదు. ఇంటి పట్టునే ఉంది కరోనా మహమ్మారిని అంతం చేయాలని, కాన్నీ వీళ్ళు వేశావు సెలవులకి అమ్మమ్మ ఊళ్లకు వెళ్తామని పిల్లలు మారాం చేసినట్టు రోడ్డులేక్కి లబోదిబోమంటున్నారు. అయితే వీళ్ళెంత నిష్టూరాలు వేసిన ఏపీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. దీన్నే ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడమా అంటారని రెండు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.