మాకొద్దు! మాకూ వద్దు!

MANY PEOPLE ARE STRUCK AT AP BORDER

తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెల్లవంటుంది. అవి మామూలు పత్రాలు కాదు. హైదరాబాద్ నుండి ఏపీ లోకి ఎంటర్ అయ్యేందుకు తెలంగాణా ఇచ్చిన అనుమతి. విచిత్రంగా ఉంది కదూ, ఏపీ లోకి ఎంటర్ అవ్వడానికి అనుమతిని, ఏపీ ఇవ్వాలిగానీ, తెలంగాణా అధికారులు ఇవ్వడమేంటి? అనే చిన్న లాజిక్ ను కూడా తెలుసుకోలేని కొన్ని వందల మంది ఏపీ, తెలంగాణా సరిహద్దులో రోడ్ల మీద చిక్కుకుని ఉండిపోయారు. అంతే కాదు వారంతా ఏపీ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రిపై నిందలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక మహా యజ్ఞంలా లాక్ డౌన్ చేస్తుంటే, కనీస జ్ఞానం లేకుండా మందలు మందలు గొర్రెల్లా కలిసి ప్రయాణించి, ఇంతవరకు పడిన జాగ్రత్తలను మంటగలిపారని వీళ్లందరి మీద ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు బయటకి రాకుండా ఉండమంటే, వీళ్లంతా ఎందుకు ఇంత అతి చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని వాపోతున్నారు. అయితే వీళ్ళని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కి అనుమతించడం లేదు. తెలంగాణా కూడా అనుమతించేలా లేదు. ఇంకా వాళ్ళ గతేంటో చూడాలి.