ఆర్ ఆర్ ఆర్ పై : మెగాస్టార్ ఒక‌లా.. ఆర్జీవీ మ‌రోలా..!

 chiranjeevi and rgv comments on rrr 

ఆర్ ఆర్ ఆర్ లోగో టైటిల్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల అయ్యిందో లేదో సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో త‌మ స్పంద‌న తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉగాది రోజు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ఆర్ ఆర్ ఆర్ మోష‌న్ పోస్ట‌ర్ ఒళ్ళు గ‌గుర్పొడిచేలా ఉందని, క‌నుల‌కు ర‌నువిందుగా ఉంద‌ని తెలిపారు. అలాగే కీర‌వాణి నేప‌ధ్య సంగీతం అదిరిపోయింద‌ని, రాజ‌మౌళి, తారక్, చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురి ప‌రితీరు అద్భుతంగా ఉంద‌ని, ఉగాది రోజున ప్రేక్ష‌కుల్లో ఎనర్జీ నింపార‌ని చిరంజీవి వెళ్ళ‌డించారు. 

ఇక మ‌రోవైపు మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఆర్ ఆర్ ఆర్ పై స్పందించారు. అయితే వ‌ర్మ‌ మాత్రం మ‌రోలా స్పందించారు. కరోనా వైర‌స్ దెబ్బ‌కి విరామం లేకుండా నిత్యం డిప్రెస్సింగ్ వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో, జీవితంలో రాబోయే ఇలాంటి మంచి విష‌యాల కోసం ఎదురు చూడాల‌ని, అలా జ‌ర‌గాలంటే ముందు మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని గుర్తు చేసిన రాజ‌మౌళి గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా-చ‌ర‌ణ్‌,  కొమ‌రం భీంగా- తార‌క్ న‌టిస్తుండగా, వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి అండ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.