టైటిల్ లోగో అండ్ మోష‌న్ పోస్ట‌ర్.. రియ‌ల్ టాక్ అవుట్..!

rrr title logo and motion poster talk out

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ ఆర్ ఆర్. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో అండ్ మోషన్ పోస్టర్ రెండిటిని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్  డెఫినెష‌న్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన ప్రేక్ష‌కులకు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు రాజ‌మౌళి. 

మోష‌న్ పోస్ట‌ర్‌లో రామ్ చరణ్‌ (అల్లూరి సీతారామ‌రాజు)ని రౌద్రంగా, ఎన్టీఆర్ )కొమ‌రం భీం)ని రుధిరంగా చూపిస్తూ.. ఈ ఇద్ద‌రు క‌లిసి ఆంగ్లేయుల పై చేసే ర‌ణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి అన్న‌ట్టుగా టైలిల్‌ను రివీల్ చేశారు. ఫైన‌ల్‌గా ఆర్ ఆర్ ఆర్ అంటే రౌద్రం-ర‌ణం-రుధిరం (రైజ్‌-రివోల్ట్‌-రోర్) అని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా టైటిల్ స‌స్పెన్స్‌ని రివీల్ చేశారు. 

ఇక మోష‌న్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. తార‌క్‌ను జ‌లానికి ప్ర‌తీక‌గా, చ‌ర‌ణ్‌ను అగ్నికి ప్ర‌తీక‌లా చూపించారు. జ‌లం అగ్నిని ఆర్పుతుంది, అదే అగ్ని జ‌లాన్ని ఆవిరి చేస్తుంది, కానీ ఈ రెండు స‌హ‌జ‌మైన‌ బ‌లాలు క‌లిస్తే.. క‌లిసి ఓ మ‌హాశ‌క్తిగా ఏర్ప‌డి మీ ముందుకు వ‌స్తే ఏం జ‌రుగుతోంది.. అనే ప‌వ‌ర్‌ఫుల్ పాయింట్‌తో ప్రేక్ష‌కుల్లో ఆశ‌క్తిని పెంచేలా చేశారు. 

ఇక‌పోతే బ్యాగ్రౌండ్ మ్యూజిక‌ హైలెట్‌గా నిలిచింది. కీర‌వాణి అందించిన నేప‌ధ్య సంగీతం మ‌రోసారి మ్యాజిక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక  350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య నిర్మిస్తుండ‌గా, ఆలియా భ‌ట్, ఒలివియా మోరీస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఎడాది జ‌న‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మవుతున్నారు.