మేమింటికెళ్ళిపోతాం

hostelers are struggling

కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయించిన అనంతరం హైద్రాబాద్లో ఉన్న హాస్టల్స్ అన్ని మూతబడ్డాయి. పోలీసులు హాస్టల్స్ లోన్ ఉన్న వారిని ఖాళీ చేయించి, వాళ్ళను వారి గృహాలకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం అనుమతి లేఖలను పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ల దగ్గర హాస్టలర్స్ అనుమతుల కోసం వేచియున్నారు. అయితే ఎటువంటి రవాణా సదుపాయం లేకుండా వారి గృహాలకు ఎలా వెళ్తారనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉండలేక, ఊళ్లకు వెళ్లేందుకు సరైన సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా భయం వలన వాళ్ళని ఎవరు ఇళ్లలోకి రానివ్వడం లేదని, సరైన ఆహారం కూడా దొరకకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని భాధను వ్యక్తం చేస్తున్నారు.వీళ్ళని ఇక్కడ ఉంచలేక, బయటకి పంపిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి తెలియక, తెలంగాణా ప్రభుత్వం తలను పట్టుకునే పరిస్థితి వచ్చింది.