కేంద్ర కేబినెట్ భేటీలో.. సోషల్ డిస్టెన్స్

కేంద్ర కేబినెట్ భేటీలో.. సోషల్ డిస్టెన్సింగ్ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటల నేతను కాదు.. చేతల నేతను అని మరోసారి చాటారు. కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో దేశప్రజలందరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రధాన మంత్రి పదే పదే పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక దూరాన్ని పాటించే దిశగా తాము సైతం వైద్యుల సూచనలను పాటిస్తున్నామని ప్రధాన మంత్రి చాటిచెప్పారు.
         ఇవాళ‌ న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సంప్రదాయ సమావేశం తీరును పక్కన పెట్టి.. కుర్చీలను దూరం దూరం వేసుకుని కేబినెట్ భేటీని ప్రధాని మోడీ నిర్వహించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాన మంత్రి పక్కన కొద్ది దూరంలో ఓ పక్కన అమిత్ షా, మరో పక్కన రాజ్‌నాథ్ సింగ్ ఫోటోలో కనిపిస్తున్నారు. సమావేశంలో దూరం దూరంగా కూర్చున్న ప్రధాని.. ప్రతీ సీటు మధ్య కనీసం మూదు అడుగుల దూరం మెయింటేన్ చేశారు.