క‌రోనా నివార‌ణ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష 

 క‌రోనా నివార‌ణ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష 

దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభిస్తున్న విష‌యం విదిత‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి క‌రోనా నివార‌ణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌గ్ర‌స‌ర్వే నిర్వ‌హించాల‌ని, ప్ర‌తి ఇంటికి వెళ్ళి కుటుంబ స‌భ్యుల ఆరోగ్య వివ‌రాలు తెల్సుకుని వారి వివ‌రాలు న‌మోదు చేయాల‌ని ఆదేశించిన విష‌యం విదిత‌మే.