'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల !

 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల !

ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను  ఆ సినిమా బృందం విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌ హీరోలు రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. పలు భాషల్లో ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సినిమాకు 'రౌద్రం.. రణం.. రుధిరం' పేరు పెట్టారు.
టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి `ఆర్ ఆర్ ఆర్‌` (రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మోషన్ పోస్టర్‌లో రామ్‌చరణ్ ని బడబాగ్నిగా చూపించిన రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఉప్పెనగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఒకరు రౌద్రం.. ఒకరు రుధిరం.. ఈ ఇద్దరు కలిసి చేసే రణం ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోండి అన్నట్టుగా వుంది మోషన్ పోస్టర్‌. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రం బ్రిటీష్ ఇండియా కాలం నేపథ్యంలో అత్యంత శక్తి మంతంగా రాజమౌళి మార్కు అబ్బుర పరిచే సన్నివేశాలతో సాగుతుందని అర్థమవుతోంది.
మోషన్ పోస్టర్‌లో కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం, బీజిఎమ్స్ రోమాంచితంగా వున్నాయి. సినిమాలో ఆయన తన నేపథ్య సంగీతంతో మరోసారి `బాహుబలి` మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలాయాభలట్‌, ఒలివియా మోరీస్ కథానాయికలు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా 10 ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది.