మొట్టమొదటి ట్వీట్ చేసిన చిరంజీవి

మొట్టమొదటి ట్వీట్ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించారు. ఇప్పటికే ఆయన ఇన్ స్టాగ్రామ్ లోనూ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.  'చిరంజీవి కొణిదెల' అనే పేరుతో ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ప్రారంభించారు. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం.. ఇంటి పట్టునే ఉందాం.. సురక్షితంగా ఉందాం..' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ ట్విటర్‌లోకి అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆయన్ని దాదాపు 12 వేల మంది ఫాలో అవుతున్నారు. కాగా, చిరు చేసిన తొలి ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ పలువురు హీరోలు ఆయనకు సామాజిక మాధ్యమాల్లోకి స్వాగతం పలికారు. చిరుకి స్వాగతమని, ఆయన చెప్పే మాటలు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు.