క‌రోనా పై పోరాటం.. మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్..!

ys jagan another key decision

ప్ర‌పంప వ్యాప్తంగా క‌ల్లోలం రేపుతూ, అగ్ర‌రాజ్యాల‌కు సైతం చుక్కలు చూపిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా క‌రోనా నివార‌ణ‌కు ఏపీ ముఖ్య‌మంత్రి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌గ్ర‌స‌ర్వే నిర్వ‌హించాల‌ని, ప్ర‌తి ఇంటికి వెళ్ళి కుటుంబ స‌భ్యుల ఆరోగ్య వివ‌రాలు తెల్సుకుని వారి వివ‌రాలు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. 

ఈ స‌మ‌గ్ర స‌ర్వే వ‌ల్ల ముఖ్యంగా విదేశాల నుండి వ‌చ్చిన వారి లెక్క తేలిపోతుంద‌ని, ఎక్కువ‌గా క‌రోనా వైర‌స్ వారి నుండే వ్యాప్తి చెందుతున్న నేప‌ధ్యంలో వారిని గుర్తిస్తే, వైర‌స్ వ్యాప్తిని స‌గం అడ్డుకున్న‌ట్టే అని జ‌గ‌న్ అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జ్వ‌ర‌పీడితులు ఎంత‌మంది ఉన్నారనే విష‌యం కూడా తెలిసిపోతుంద‌ని, దీంతో రెండు రోజుల్లో ఈ స‌మ‌గ్ర స‌ర్వే పూర్తి చేసి నివేదిక‌ను ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు జ‌గ‌న్. ఈ క్ర‌మంలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఈ స‌మ‌గ్ర స‌ర్వే చేయ‌నున్నార‌ని స‌మాచారం.