భారత్‌లో 11కు చేరిన క‌రోనా మృతుల సంఖ్య 

భారత్‌లో 11కు చేరిన క‌రోనా మృతుల సంఖ్య 

 ప్రపంచవ్యాప్తంగా విస్త‌రిస్తున్న‌కరోనా వైరస్‌ భారత్‌లోనూ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదయింది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ధృవీకరించారు. కాగా, భారత్‌లో 536 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. 11 మంది బాధితులు చనిపోయారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు.. 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి ఇదే ఏకైక మార్గమని ప్రధాని తెలిపారు. ప్రజలెవరూ గడపదాటి బయటకు రావద్దని ప్రధాని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తేనే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.