క‌నిపిస్తే కాల్చివేత : ఇదే మీకు లాస్ట్ వార్నింగ్..!

  cm kcr warns to telangana people 

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స ప్ర‌భ‌లుతున్న నేప‌ధ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా రోడ్ల పైకి వ‌స్తున్నార‌ని, దీంతో వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన కేసీఆర్ తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారిలో ఒక‌రు డిశ్చార్జ్ అయ్యార‌ని కేసీఆర్ తెలిపారు. ఇక మిగిలిన వారు కూడా కోలుకుంటున్నార‌ని వారు త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ అవుతార‌న్నారు.

ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తుంటే, కొంత‌మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని దీంతో వారి పై చ‌ర్య‌లు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌జాస్వామ్య దేశంలో తొలుత ప్ర‌జ‌ల‌కు మంచిగానే చెబుతామ‌ని, అయినా ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే, ఆర్మీని రంగంలోకి దించాల్సి వ‌స్తుంద‌ని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి ప‌రిస్థితులు తెచ్చుకోకుండా ప్ర‌జ‌లే అప్ర‌మ‌త్తంగా ఉండి స‌హ‌క‌రించాల‌ని కేసీఆర్ కోరారు.