క‌రోనా ఫిక‌ర్ :  ప్ర‌ధాని మోదీజీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

three weeks lockdown in india

క‌రోనా వైర‌స్ పై ఫిక‌ర్‌తో ఈరోజు అర్ధ‌రాత్రి నుండి దేశం వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించినా, అనేక చ‌ర్య‌లు తీసుకున్నా, క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతున్న నేప‌ధ్యంలో, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకోవ‌డానికి లాక్‌డౌన్ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఇది ఒక ర‌కంగా దేశ వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించ‌డ‌మే అని మోదీ తెలిపారు. 

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంద‌ని, ఇది మ‌నంద‌రికి ప‌రీక్షా స‌మ‌య‌మ‌ని, నిర్ల‌క్ష్యంగా ఉంటే భారీగా ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని, అందుకే మూడు వారాల పాటు లాక్‌డౌన్ చేయాల్సి వ‌చ్చింద‌ని, దీంతో రాబోవు 21 రోజులు అంద‌రికీ కీల‌క‌మ‌ని, ప్ర‌తి ఒక్క‌రు ల‌క్ష్మ‌ణ రేఖ గీసుకోవాల‌ని, క‌రోనా వైర‌స్ ప్ర‌భ‌ల‌కుండా ఉండాలంటే ప్ర‌జ‌ల స‌హ‌కారం చాలా అవ‌స‌ర‌మ‌ని, క‌రోనాను నివారించాలంటే ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌ని న‌రేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ప్ర‌జ‌లు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటించాల‌ని, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని చెప్పారు.