ఈసారి ర‌జ‌నీకాంత్‌ని.. కెలికిన రామ్ గోపాల్ వ‌ర్మ‌..!

ram gopal varma comments on rajinikanth

యావ‌త్ ప్ర‌పంచ మాన‌వాళిని క‌రోనా వైర‌స్ టార్గెట్ చేస్తే.. మిస్ట‌ర్ వివాదం, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేస్తున్నాడు. క‌రోనా వైర‌స్‌కు దేవుళ్ళ‌తో ఎఫైర్ ఉంద‌ని ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేసి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపిన వ‌ర్మ‌, తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాడు. 

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని నాశ‌నం చేసేందుకు ర‌జ‌నీకాంత్ ఎందుక‌ని.. ఏం చేయ‌డంలేదంటూ ఫ‌న్నీ మీమ్స్‌తో ట్వీట్ చేశాడు. దీంతో ర‌జనీ అభిమానులు ఆర్జీవీ పై తీవ్రంగా మండిప‌డుతున్నారు. త‌మ అభిమాన హీరో పైనే వ్యంగంగా విమ‌ర్శ‌లు చేస్తావా అంటూ, వ‌ర్మ పై కామెంట్ల‌తో విరుచుకు ప‌డుతున్నారు. అయితే వ‌ర్మ ర‌జ‌నీని టార్గెట్ చేయ‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలో కూడా ఓ సినిమాలో ర‌జనీ గెట‌ప్ పై కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.