టోక్యో ఒలంపిక్స్ : అనుకున్న‌ట్లే జ‌రిగింది..!

tokyo olympics postponed

జపాన్‌ వేదికగా అతి పెద్ద క్రీడల మహాసంగ్రామం జులై 24 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృదంగా మోగిస్తున్న నేప‌ధ్యంలో జపాన్ ప్ర‌భుత్వం టోక్యో ఒలంపిక్స్‌ను వాయిదా వేసింది. ఒక‌వైపు క‌రోనా వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తున్నా, ఒలింపిక్స్‌ నిర్వహణ పై ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ధీమాగానే ఉంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌ధ్యంలో అన్ని వైపుల నుండి ఒలింపిక్స్‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్స్ వెలువెత్తాయి. దీంతో అంద‌రు ఊహించిన విధంగానే టోక్యోలో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ వాయిదా ప‌డింది. ఈ మేర‌కు జపాన్‌ దేశ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్ సంయుక్తంగా క‌లిసి ఒలింపిక్స్ వాయిదా పై నిర్ణయం తీసుకున్నార‌ని, 2021 వేస‌విలో ఒలింపిక్స్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిర్వాహకులు ప్రకటించారు.