ఈ టైమ్‌లో రాజ‌కీయాలేంటి బాబు గారు..?

alla nani comments on chandrababu

ఒక‌వైపు క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగిస్తుంటే.. మ‌రోవైపు చంద్ర‌బాబు మాత్రం క‌రోనా సిట్యువేష‌న్‌ను ఉప‌యోగించుకుంటూ రాజీయాలు చేస్తున్నార‌ని మంత్రి ఆళ్ళ నాని అన్నారు. క‌రోనా నివార‌ణ‌కు ముంద‌స్తు చ‌ర్య‌లు, ప్ర‌త్యేక చ‌ర్య‌లు, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవంలో ఏపీ ప్ర‌భుత్వం ఒక అడుగు ముందే ఉంద‌ని, అయితే చంద్ర‌బాబు మాత్రం ప్ర‌జ‌ల‌ను బ‌య‌పెట్టే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆళ్ళ నాని మండి ప‌డ్డారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్నార‌ని, ఎప్ప‌టి క‌ప్పుడు అధికారుల‌కు సూచ‌న‌లు చేస్తున్నార‌ని తెలిపారు. ఇక ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఏదో ఒక ర‌కంగా రాజ‌కీయం చేయాల‌ని చూస్తే చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని ఆళ్ళ నాని అన్నారు.