పోలీసుల విన్నూత్న అభ్యర్ధన

police lost their patience

దేశమంతా లాక్ డౌన్ లో ఉన్నా పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించి పహారా కాస్తున్నారు. ఇంత జరుగుతున్న వైద్యులు, ప్రముఖ వ్యక్తులు అదే పనిగా హెచ్చరిస్తున్నా కొందరికి మాత్రం ఇవేం పట్టడం లేదు.బయటకు రాకుండా ఉండడమంటే వారి వల్ల కావట్లేదు, పోనీ వచ్చి ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నారా అంటే అదేం లేదు ఊరికే రోడ్లమీద తిరుగుతున్నారు.
పోలీసుల చేతిలో దెబ్బలు కాయడానికి సిద్దపడుతున్నారు కానీ, ఇంట్లో మాత్రం ఉండడం లేదు. వారికి ఎంత దండించిన మార్పు సంభవించనందుకు, పోలీసుల్లో విసుగు పుట్టి ఓర్పు నశించింది. అందుకే ఇంకా వీళ్ళని దండించి లాభం లేదు, బతిమాలుకోవడమే మంచిది అని అనుకున్నారో ఏమో. రోడ్ల మీదకి వచ్చే వారికి నమస్కరించి తిరిగి ఇళ్ళకి పొమ్మని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుని, ఇంటి పట్టున ఉంటె మంచిది లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికే భయం వేసే స్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వం చెప్పేంత వరకు ఇంట్లోనే ఉందాం. వైద్యులకు పోలీసులకు సహకరిద్దాం. కరోనాను అంతం చేద్దాం.