ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు :నిర్మ‌లా సీతారామ‌న్ 

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు :నిర్మ‌లా సీతారామ‌న్ 

 దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలుకు చివరి తేదీ ఈనెల 30వ‌ర‌కు ఉండ‌గా, ఆ గడువును జూన్‌ 30 వరకూ పొడిగించిన‌ట్లు తెలిపారు. అలాగే పాన్‌, ఆధార్‌ లింకింగ్‌కు డెడ్‌లైన్‌ను కూడా మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకూ పొడిగించారు. ఇక ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.
రూ.5 కోట్ల లోపు టర్నోవర్‌ కలిగిన కంపెనీలకు జీస్‌టీ రిటర్న్స్‌పై వడ్డీ, లేటు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రూ 5 కోట్లకు మించిన టర్నోవర్‌ కలిగిన కంపెనీలకు లేటు ఫీజు ఉండదు..కానీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ -19 ఆర్థిక వ్యవస్ధపై చూపే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజ్‌పై కసరత్తు సాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.