24 గంటల్లో ఒక్క కరోనా కేసు న‌మోదు కాలేదు :  కేజ్రీవాల్ 

24 గంటల్లో ఒక్క కరోనా కేసు న‌మోదు కాలేదు :  కేజ్రీవాల్ 

ఢిల్లీలో 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. కరోనా విజృంభణ అంశం మన చేతుల్లోంచి జారి పోకుండా చేసుకోవడమే అతి పెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు. 'ఆసుపత్రుల నుంచి ఐదుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యార‌ని తెలిపారు. అయితే ఇది అంతగా సంతోషపడాల్సిన విషయం కాదని.. పరిస్థితులు మన చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.