ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధం ఎత్తివేత

ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధం ఎత్తివేత

 జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద అమలు చేస్తున్న నిర్బంధాన్ని కేంద్రం ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఒమ‌ర్ అబ్దుల్లా విడుద‌లైన‌ట్లు జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్లానింగ్) రోహిత్ కన్సాల్ తెలిపారు. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినప్పటి నుంచి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఈనెల ప్రారంభంలో నిర్భందం నుంచి విడుదల చేశారు.