రాజ్య‌స‌భ ఎన్నిక‌లు వాయిదా 

రాజ్య‌స‌భ ఎన్నిక‌లు వాయిదా 

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పుంజుకుంటుండ‌డంతో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు వాయిదా పడ్డాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈసీ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప‌ది రాష్ట్రాల్లో 37 రాజ్య‌సభ సీట్లు ఇప్ప‌టికే ఏక‌గ్రీవం కాగా, మిగిలిన 18 సీట్ల‌కు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు వాయిదా పడ్డాయి. దాఖ‌లైన నామినేస‌న్లు అన్ని వాలిడ్ గా ఉంటాయ‌ని, త‌దుప‌రి పోలింగ్ డేట్ ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఈసీ వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ఎయిర్ లైన్స్, రైళ్లు నిలిచిపోయాయి.