నాగబాబుకు కరోనా

CORONA POSITIVE TO NAGABABU

మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబు కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "ఓ వ్యాధి వచ్చిందని ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మలుచుకోవచ్చు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. త్వరలోనే దీన్ని జయించి ప్లాస్మాదాతగా మారుతాను" అని చెప్పుకొచ్చారు. 
ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.
దర్శకుడు మారుతి సైతం ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు. కాగా టాలీవుడ్‌లో దర్శకుడు రాజమౌళి కుటుంబం, డైరెక్టర్‌ తేజ, సింగర్లు సునీత, మాళవిక, స్మిత, నటులు రవికృష్ణ, నవ్య స్వామి, పార్వతి సహా పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో చాలామంది ప్లాస్మా దానం కూడా చేశారు.