కరోనా కాటుకి వైసీపీ ఎంపీ మృతి

YCP MP DIED BY CORONA

కోవిడ్‌-19తో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారిన పడ్డ ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దుర్గాప్రసాద్‌ 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. నెల్లూరు జిల్లా గుడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.