హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు 

హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు 

ఏపీ ప్ర‌భుత్వానికి అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని భూముల సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ... అన్ని పనులు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. సిట్, టీడీపీ హయాంలో పనులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.