తెలంగాణ‌లో కొత్త‌గా 2,273 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 2,273 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజురోజుకు క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయే తప్ప త‌గ్గ‌డం లేదు. తాజాగా తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 2,273 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది. అలాగే క‌రోనాతో 24గంట‌ల్లో 12 మంది మృతిచెందార‌ని తెలిపింది. అయితే కొత్త‌గా న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 325 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,62,844కు చేరుకుంది. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 996 కు చేరుకుంది.  కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,260 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ఆస్ప‌త్రుల్లో చిక‌త్స పొందుతూ కోలుకుని 1,31,447మంది డిశ్చార్జ్ కాగా, 30,401 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది.