శర్వాకు జోడీగా ఐశ్వర్య రాజేష్

AISWARYA RAJESH ACT WITH SHARVANAND

ఆర్ఎక్స్ 100 మూవీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి... శర్వానంద్ హీరోగా మహాసముద్రం చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు కాచుకు కూర్చున్నాడు. మరోవైపు ప్రస్తుతం చేస్తున్న శ్రీకారం సినిమా పూర్తి అయిన శర్వా మహా సముద్రం సినిమాను చేయబోతున్నాడు. మహాసముద్రం సినిమాలో శర్వాకు జోడీగా సమంత నటించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వచ్చాయి. కాని చివరకు వరల్డ్ ఫేమస్ లవర్ సువర్ణ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.