ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న కరోనా

CORONA INCREASED IN ANDHRA

కరోనా టెస్టులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తున్నా.. కేసులు మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 46,61,355 టెస్టులు చేయగా.. 5,75,079 కేసులు నమోదయ్యాయి. అంటే.. ఆరు లక్షలకు చేరువలో ఉన్నాయి. దాదాపు ప్రతీ జిల్లానూ కరోనా అంటుకుంది.
అయితే.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు.
రాష్ట్రంలోకి కరోనా వచ్చిన ప్రారంభంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉండేది. కొన్ని నెలల తరబడి అయితే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో చాలా జిల్లాల్లో కూడా సంఖ్య జీరోగానే ఉండిపోయింది. రాష్ట్రంలోకి వైరస్‌ వచ్చిన మొదట్లో కేవలం మేజర్‌ నగరాలకే పరిమితమైంది. ఎప్పుడైతే మర్కజ్‌ మసీదు ప్రార్థనలు, కోయంబేడు మార్కెట్‌ ఇష్యూ మొదలైందో అప్పటి నుంచి జిల్లాలకు అంటుకుంది. వేలు దాటి లక్షకు చేరువవుతున్నాయి.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 80 వేలకు చేరువలో ఉన్నాయి. దాదాపు 500 మంది వరకూ కరోనాతో మరణించారు. తొలినాళ్లలో బీభత్సం సృష్టించిన కర్నూలు జిల్లాలో నేడు 50 వేల కేసుల వరకూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోనూ కరోనా కేసులు 40 వేలకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.