ప్రభాస్‌ తమ్ముడిగా తమిళ‌ హీరో

atharva act as brother of prabhas

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న‌ చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ తమ్ముడి పాత్రలో తమిళ యంగ్‌ హీరో అథర్వా మురళి నటిస్తారని సమాచారం. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్‌ 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో కీలక పాత్ర చేశారు అథర్వా మురళి. 'రాధేశ్యామ్‌'లోనూ అతని పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ నెల చివర్లో ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ప్యాన్‌ ఇండియా మూవీ విడుదల కానుంది.