భార‌త్ లో కొత్త‌గా 83,809 కరోనా కేసులు

భార‌త్ లో కొత్త‌గా 83,809 కరోనా కేసులు

భార‌త్ లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. క‌రోనా వైర‌స్ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. తాజాగా గ‌త 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య  49,30,237కు చేరింది. తాజాగా వైరస్‌ బారిపడి 1054 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 80,776కి పెరిగింది. 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 79,292 డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 38,59,400గా నమోదైంది. దేశంలో 78.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. యాక్టివ్ కేసుల శాతం 20.08 శాతం ఉండగా... దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.64 శాతానికి తగ్గాయ‌ని కేంద్రవైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.