జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌నం.. ప‌చ్చ సైన్యం మెడ‌కు సీబీఐ ఉచ్చు..!

cbi investigation on amaravathi capital land scam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రిగిన భూ ఆక్ర‌మ‌ణ‌ల పై విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించింది. దీంతో కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ, అనేక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డి, అక్ర‌మాల‌కు తెర‌లేపిన చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజ నిర్ణ‌యం మింగుడు ప‌డ‌క‌పోవ‌చ్చు. 

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌క ముందే టీడీపీ నేత‌లు అక్క‌డ ముందుగానే నాలుగు వేల ఎక‌రాలను కొనుగోలు చేశార‌ని, రాజ‌ధాని ప్రాంతం భూ దందా హైరేంజ్‌లో జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అలాగే అప్ప‌ట్లో ఈ పాయింట్ వైసీపీ వేసే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాంన చెప్ప‌లేక నీళ్ళు న‌మిలారు టీడీపీ త‌మ్ముళ్ళు. రాజ‌ధాని భూ దందా వ్య‌వ‌హారం ప‌తాక స్థాయికి చేరుకోవ‌డంతో టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూ.. దమ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌వాళ్ళు విసిరారు.  

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే.. రాజ‌ధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పై అస‌లు నిజాలు తేల్చ‌డానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించ‌గా.. కొన్ని నెలల కసరత్తు చేసిన తర్వాత,  రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌కు ముందు టీడీపీ నేత‌లు కొన్ని వేల ఎక‌రాలు కొనుగోలు చేశార‌ని.. కొందురు బినామీ పేర్ల‌మీద కూడా కొన‌గోలు చేశార‌ని క‌నుగొంది. ఈ క్ర‌మంలో మంత్రివ‌ర్గ ఉప‌సంఘం.. దీనికి సంబంధించి ఓ నివేద‌క‌ను ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  సమర్పించింది.

 దీంతో వాటి ఆధారంగా రాజ‌ధాని వ్య‌వ‌హారంలో టీడీపీ ప్ర‌భుత్వం తీసుకున్న విధాన నిర్ణ‌యాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల మీద నిగ్గు తేల్చ‌డానికి ఓ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా రాజ‌ధాని భూదందాల వ్యవహారాల పై తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది జగన్ సర్కారు. ఈ మేరకు రాజ‌ధాని ఆక్ర‌మ‌ణ‌ల పై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో టీడీపీ త‌మ్ముళ్ల మెడ‌కు సీబీఐ ఉచ్చు ఏవిధంగా బిగిస్తుందో చూడాలి. 

.

ఎట్టకేలకు విపక్షాల డిమాండ్ మేరకే జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. భూదందాల వ్యవహారాలను సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతంలో సేకరించిన భూముల్ని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చిన రోజునే, ఈ భూ దందాలను సీబీఐకు అప్పగించడం విశేషం.