బాలయ్య సినిమాలో అల్లరోడు

ALLARI NARESH ACT IN BALAYYA'S MOVIE

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బీబీ3 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధింఇన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. తన కామెడీ టచ్ తో నటనతో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన అల్లరి నరేశ్..ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నాడట.
ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ అసిస్టెంట్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండగా..కాస్త వినోదంగా సాగే ఈ పాత్ర కోసం అల్లరి నరేశ్ లాంటి హీరో అయితే బాగుంటుందని బోయపాటి అనుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. మరి బోయపాటి ఆఫర్ కు అల్లరి నరేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?
అనేది తెలియాల్సి ఉంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయనున్నట్టు బోయపాటి ఇప్పటికే తెలిపారు.