భారత్‌లో మ‌రో 92,071మందికి క‌రోనా 

భారత్‌లో మ‌రో 92,071మందికి క‌రోనా 

భారతదేశంలో కరోనా వైర‌స్ విజృంభ‌ణ‌ కొనసాగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రికార్డుల స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా... గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,78,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,071 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోశ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. వీరిలో 9,86,598 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 37,80,107 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,136 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 79,722కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంద‌ని తెలిపింది. కరోనా ఉదృతి ఇలానే కొనసాగితే రాబోయే రెండు నెలల కాలంలో ఇండియాలో కరోనా కేసులు రెండు కోట్లకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.