పీఎంవోలోకి ఐఏఎస్ అమ్రపాలి 

పీఎంవోలోకి ఐఏఎస్ అమ్రపాలి 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన‌ యువ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి అరుదైన అవ‌కాశం లభించింది. పీఎంవోలో చాన్స్ కొట్టేసింది. ఈమె ఏ జిల్లాల్లో విధులు నిర్వర్తించినా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించిన ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ 2010 బ్యాచ్‌కు చెందినవారు. ఈమె వికారాబాద్ సబ్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, తెలంగాణ ఎన్నికలకు సంయుక్త సీఈఓ గా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. రఘురాజ్ రాజేంద్రన్, ఆమ్రపాలి, మంగేష్ గిల్డియాల్ అనే ముగ్గురు ఐఎఎస్ అధికారుల నియామకాలను కేబినెట్ నియామక కమిటీ (ఎసిసి) క్లియర్ చేసింది. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన రఘురాజ్ రాజేంద్రన్‌ను డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని అమ్రపాలిని డిప్యూటీ సెక్రటరీగా, ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన మంగేష్ గిల్దియాల్‌ను అండర్ సెక్రటరీగా నియమించారు. కేబినెట్ నియామక కమిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు.ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27 వరకు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.