భారత్‌లో మ‌రో 94,372 క‌రోనా కేసులు

భారత్‌లో మ‌రో 94,372 క‌రోనా కేసులు

భారత్ లో కరోనా రోజురోజుకు బీభత్సం సృష్టిస్తోంది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప‌, త‌గ్గ‌డం లేదు. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా భారీగా రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో రికార్డ్ స్థాయిలో 94,372 కేసులు నమోదు కాగా, 1114 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 79,399 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతో దేశంలో మొత్తం 47,54,356 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,73,175 ఉండగా, 37,02,595 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 78,586 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా తర్వాత ఇండియా రెండో స్థానంలో ఉంది.